సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం తేదీలో మళ్లీ మార్పు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 2న జరగాల్సిన కేబినెట్ భేటీని 3కి బదిలీ అయింది. దీంతో సెప్టెంబర్ 3న ఉదయం 10:30 గంటలకు అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. అయితే అన్నింటికి కంటే ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 8న ఏపీ కేబినెట్ భేటీ జరగాల్సి ఉండేది. ఆ తర్వాత అనుహ్యంగా తేదీని సెప్టెంబర్ 2కి మార్చారు. ఇక తాజాగా ఏపీ కేబినెట్ భేటీని సెప్టెంబర్ 3కి బదిలీ చేశారు.