ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా టాక్సిక్ మూవీపై తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. అయితే టాక్సిక్ అనే పేరు రాకుండా ఆయన సెటైరికల్ గా ట్వీట్ చేశారు. “నౌ వాచింగ్ ధురంధర్ ఎగైన్” అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. టాక్సిక్ నచ్చలేదు అని చెప్పకుండా ధురంధర్ మూవీని మరోసారి చూస్తున్నా అంటూ ఆయన ట్వీట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ ట్వీట్ పై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.