చిన్నారులపై సోషల్ మీడియా దుష్ప్రభావాల కేసులో అమెరికాతో మెటా సంస్థ సెటిల్మెంట్ చేసుకుంది. 18 బిలియన్ డాలర్ల ( ₹1.72 లక్షల కోట్లు) పరిహారాన్ని అమెరికా రాష్ట్రాలకు, యూఎస్ ప్రభుత్వ ఆధీనంలోని ప్రాంతాలకు చెల్లించేందుకు అంగీకరించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. టీనేజర్లు, చిన్నారులు సోషల్ మీడియాకు బానిసయ్యేలా ఇస్టా, ఫేస్బుక్ వేదికలను మెటా సంస్థ నిర్వహించిందని,చిన్నారుల మానసిక, శారీరక ఆరోగ్యాలపై పడే ప్రతికూల ప్రభావాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని అమెరికా రాష్ట్రాలు కేసు వేసిన విషయం తెలిసిందే.