తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు సమాచారం.1976లో విడుదలైన ‘అంతులేని కథ’ చిత్రం ద్వారా జీవీ నారాయణరావు వెండితెరకు పరిచయమయ్యారు. పలువురు సినీ ప్రముఖులు, సహచర నటులు ఆయన మృతికి సంతాపం తెలియజేస్తున్నారు.