loader

వాషింగ్టన్‌లో విస్తరిస్తున్న కార్చిచ్చు.. అత్యవసర పరిస్థితి విధింపు

వాషింగ్టన్ రాష్ట్ర పరిధిలోని అటవీ ప్రాంతాన్ని కార్చిచ్చు దహించి వేస్తుండగా, సమీపం లోని వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తాజాగా మరో 60 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు పంపారు. మంటలకు కారణమని భావిస్తున్న స్పోకేన్‌కు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వాషింగ్టన్ వ్యాప్తంగా 16 ప్రదేశాల్లో కార్చిచ్చు వ్యాపించింది. వందల భవనాలు అగ్నకి ఆహుతయ్యాయి. స్పోకేన్ ప్రాంతంలో మంటలు కొనసాగుతుండడంతో వాటిని అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ 2026 విడుదల..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది.    ఆగస్టు 5 నుంచి 20 వరకు: హెల్ప్‌డెస్క్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన | ఆగస్టు 12, 13 తేదీలు: ప్రత్యేక కేటగిరీ విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన | ఆగస్టు 20: వెబ్ ఆప్షన్లలో మార్పులకు అవకాశం | ఆగస్టు 26: సీట్ల కేటాయింపు ఫలితాల ప్రకటన  | ఆగస్టు 27 నుంచి 29 వరకు: కళాశాలల్లో విద్యార్థుల చేరికలు,తరగతులు […]

జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రేపల్లె టీడీపీ కీలక నేత

బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.  మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రధాన అనుచరుడు గూడపాటి శ్రీనివాసరావు వైసీపీలో చేరారు.  రేపల్లెకు చెందిన ప్రముఖ తెలుగు దేశం పార్టీ (టీడీపీ) నేత గూడపాటి శ్రీనివాసరావు అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు.  టీడీపీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానన్న గూడపాటి.. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరినట్లు తెలిపారు.

‘అమరజీవి జలధార’పై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు

జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘అమరజీవి జలధార’ ప్రాజెక్టుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్  ఈ ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రస్తుత పురోగతిపై  ఉన్నతాధికారులతో స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ప్రాజెక్టు నిర్మాణ పనులను ముందుగా నిర్దేశించుకున్న వ్యవధిలోనే పూర్తి చేయాలని, సాధ్యమైనంత త్వరగా ప్రజలకు తాగునీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. తీర ప్రాంతాల్లో నివసించే ప్రజల తాగునీటి భద్రతను ఈ కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు.

ఈ ధైర్యం ఏదో ట్రంప్ ముందు చూపండి..అరవింద్ కేజ్రీవాల్

ఈ20 పెట్రోల్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మంది సంతకాలతో కూడిని పిటిషన్‌ను మోదీకి ఇవ్వాలని దాదాపు 100 మందితో మోదీ ఇంటికి వెళ్తున్న అరవింద్ కేజ్రీవాల్‌ను ఢిల్లీ పోలీసులు అడ్డుకున్నారు. తనను పోలీసులు అడ్డుకోవడంపై కేజ్రీవాల్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ప్రభుత్వం అడ్డుకోవడానికి చూపించే తెగువ ఏదో అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై చూపించాలని మోదీకి కేజ్రీవాల్ సవాల్ విసిరారు. ఈ20 పెట్రోల్‌ రుద్దడాన్ని ఆపండి. లేదంటే దేశంలో మరో భారీ ఉద్యమం మొదలవుతుంది’’ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.

E20 విషయంలో ముందుకే.. రాజ్యసభకు తెలిపిన కేంద్రం

ఇ20 పెట్రోల్ విషయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇ20 నుంచి ఇ0/- ఇ10 పెట్రోల్ కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని పేర్కొంది. వాహన తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ARAI, SIAM వంటి సంస్థలతో విస్తృతంగా చర్చించి శాస్త్రీయంగా ఆమోదించి తీసుకున్న నిర్ణయమని తెలిపింది.

అహంకారం వినాశనానికి దారితీస్తుంది.!. . . ఎంకే స్టాలిన్

ఉదయనిధి స్టాలీన్.. నటి త్రిషపై చేసిన డబుల్ మీనింగ్ వ్యాఖ్యలపై ఉదయ నిధిని అరెస్ట్ పై మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలీన్  ఈ వివాదంపై స్పందించారు. సీఎం విజయ్ దళపతి ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.అంతే కాకుండా.. అహంకారం పెరిగిపోతే అది అంతే తొందరగా వినాశనానికి దారితీస్తుందంటూ చురకలుపెట్టారు. కావేరి జలాల సాధనలో, మేకెదాటు డ్యామ్‌ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో  సీఎం విజయ్ తీరును ప్రశ్నించినందుకు  డైవర్షన్ లో భాగంగా ఇదంతా చేశారని ఎంకే స్టాలీన్ ఎద్దేవా […]

నీచంగా మాట్లాడాడు.. త్రిషకు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే.. ఖుష్బూ

ఉదయనిధి వ్యాఖ్యల పట్ల సినీతారలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా సినీయర్ నటి ఖుష్బూ సైతం సోషల్ మీడియా ఖాతాలో ఘాటుగా స్పందించారు. త్రిషను అవమానించినందుకు ప్రతిపక్ష నాయకుడు ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది అత్యంత అసభ్యంగా, నీచంగా, తీవ్ర అవమానకరంగా ఉంది. ఆయన పుణికిపుచ్చుకోవాలని ఆశిస్తున్న రాజకీయ సంస్కృతికి ఇది అద్దం పడుతోంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు రాజకీయ పార్టీకి నాయకత్వం వహించాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని ఆశిస్తే… ఇక దేవుడే మనల్ని కాపాడాలి.

ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు

భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. తనకున్న అత్యంత సన్నిహిత మిత్రుల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒకరు అని, భారత్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు ఇజ్రాయెల్ ఒంటరిగా ఉందనే ప్రచారం వాస్తవం కాదని నెతన్యాహు స్పష్టం చేశారు. భారత్‌తో పాటు పలు దేశాలతో ఇజ్రాయెల్ దౌత్య, ఆర్థిక, సాంకేతిక, భద్రతా రంగాల్లో సహకారం […]

సంక్షేమంపై రూ.49,401కోట్లు ఖర్చు..సీఎం చంద్రబాబు

రూ.48616 కోట్ల పెండింగ్ బిల్లులను రూ.29,259 కోట్లకు చెల్లించి తగ్గించగలిగామన్నారు. 86 కేంద్రప్రాయోజిత పథకాలను రివైవ్ చేశామన్నారు. రూ.45,138 కోట్లను కేంద్ర ప్రయోజిత పథకాలు కింద ఖర్చు చేయగలిగామని, స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వచ్చినా వాటిని మళ్లించారని.. వాటిని కూడా సరిచేసినట్లు, ఇప్పటివరకూ రూ.49,401కోట్లు సంక్షేమంపై ఖర్చు చేశామన్నారు. మెగా డీఎస్సీ విషయంలో కోడిగుడ్లపై ఈకలు పీకుతున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ షాపులు, గనుల కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించామన్నారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON