ఉదయనిధి వ్యాఖ్యల పట్ల సినీతారలు, రాజకీయ నాయకులు మండిపడుతున్నారు. తాజాగా సినీయర్ నటి ఖుష్బూ సైతం సోషల్ మీడియా ఖాతాలో ఘాటుగా స్పందించారు. త్రిషను అవమానించినందుకు ప్రతిపక్ష నాయకుడు ఆమెకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అది అత్యంత అసభ్యంగా, నీచంగా, తీవ్ర అవమానకరంగా ఉంది. ఆయన పుణికిపుచ్చుకోవాలని ఆశిస్తున్న రాజకీయ సంస్కృతికి ఇది అద్దం పడుతోంది. ఇటువంటి మనస్తత్వం ఉన్నవారు రాజకీయ పార్టీకి నాయకత్వం వహించాలని, భవిష్యత్తులో రాష్ట్రాన్ని పాలించాలని ఆశిస్తే… ఇక దేవుడే మనల్ని కాపాడాలి.