పాముకాటుకు గురైన బాధితులకు సకాలంలో వైద్యం అందక, ఆసుపత్రికి చేరుకునేలోపే ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలకు చెక్ పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యవసర వైద్య సేవలందించే 108 అంబులెన్సుల్లోనే నేరుగా ‘స్నేక్ యాంటీ వీనం’ (పాము విషానికి విరుగుడు) మందులను అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.వాహనంలోని EMT సిబ్బంది పాముకాటు బాధితుడు వివరాలను ఫోన్ ద్వారా నిపుణులైన వైద్యులకు వివరిస్తారు. వైద్యాధికారుల ప్రత్యక్ష సూచనలు మరియు మార్గదర్శకాలకు అనుగుణంగా అంబులెన్స్ సిబ్బంది ఏకాగ్రతతో యాంటీ వీనం డోస్‌ను బాధితుడికి అందిస్తారు.