రూ.48616 కోట్ల పెండింగ్ బిల్లులను రూ.29,259 కోట్లకు చెల్లించి తగ్గించగలిగామన్నారు. 86 కేంద్రప్రాయోజిత పథకాలను రివైవ్ చేశామన్నారు. రూ.45,138 కోట్లను కేంద్ర ప్రయోజిత పథకాలు కింద ఖర్చు చేయగలిగామని, స్థానిక సంస్థలకు ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్లు వచ్చినా వాటిని మళ్లించారని.. వాటిని కూడా సరిచేసినట్లు, ఇప్పటివరకూ రూ.49,401కోట్లు సంక్షేమంపై ఖర్చు చేశామన్నారు. మెగా డీఎస్సీ విషయంలో కోడిగుడ్లపై ఈకలు పీకుతున్నారంటూ మండిపడ్డారు. లిక్కర్ షాపులు, గనుల కేటాయింపుల్లో ప్రాధాన్యం కల్పించామన్నారు. మైనార్టీల సంక్షేమానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.