ఇ20 పెట్రోల్ విషయంలో వెనక్కి వెళ్లే అవకాశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ మేరకు రాజ్యసభకు లిఖిత పూర్వకంగా తెలియజేసింది. ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అడిగిన ప్రశ్నకు పెట్రోలియం శాఖ సహాయ మంత్రి సురేశ్ గోపి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఇ20 నుంచి ఇ0/- ఇ10 పెట్రోల్ కు తిరిగి వెళ్లే ఆలోచన లేదని పేర్కొంది. వాహన తయారీదారులు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు, ARAI, SIAM వంటి సంస్థలతో విస్తృతంగా చర్చించి శాస్త్రీయంగా ఆమోదించి తీసుకున్న నిర్ణయమని తెలిపింది.