loader

కాక్రోచ్ జనతా పార్టీ నిరసనల విరమణ. . .

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నిరసనకారులు, నిర్వాహకులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను ఉపసంహరించుకుంటామని కేంద్రం ఇచ్చిన హామీల నేపథ్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 49 రోజులుగా చేపట్టిన ఆందోళనను కాక్రోచ్ జనతా పార్టీ అధికారికంగా విరమించుకుంది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్‌లతో సహా ప్రభుత్వ ప్రతినిధులతో సీజేపీ ప్రతినిధి బృందానికి మధ్య మూడు దఫాలుగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం వెలువడింది.చర్చల అనంతరం సీజేపీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఈ నిర్ణయం […]

genZ లకు సోనాక్షి సిన్హా కసరత్తులు చేస్తూ క్షమాపణలు

సోనాక్షి సిన్హా, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా ప్రకటించిన తర్వాత తన ఆనందాన్ని కట్టిపడేసుకోలేక పోయింది. ఆమె యువతను తక్కువగా అంచనా వేసినట్లు అంగీకరించింది మరియు క్షమాపణ చెప్పడానికి తన చెవులను పట్టుకుని కసరత్తులు చేసింది. వీడియోలో, స్పష్టంగా ఆనందంగా ఉన్న సోనాక్షి, “మీరు ఏమి చేసినట్లు మీకు తెలియదు, మీరు ఈ రోజు ఏమి చేశారు? నేను ఒక కళాకారిని, కానీ జెన్ జీ అనేది కళ! నేను జెన్ జీని […]

చట్టసభలకు పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గించాలి: సీఎం రేవంత్ రెడ్డి

చట్టసభలకు పోటీ చేసే వయసును 21 ఏళ్లకు తగ్గించాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామన్నారు. నీట్ పశ్నపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన చేపట్టిన విద్యార్థులపై జరిగిన దాడిని నిరసిస్తూ హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డులో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాహుల్ ప్రధాని అయితే.. చట్ట సభలకు పోటీ చేసే వయసు 21 ఏళ్లకు తగ్గుతుందన్నారు. దేశంలో 30శాతం ఉన్న యువత చట్టసభలకు వెళ్లాలని ఆకాంక్షించారు.

కేంద్ర విద్యాశాఖ తాత్కాలిక మంత్రిగా ప్రహ్లాద్ జోషి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.

రెండో టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న జింబాబ్వే

హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా టీమిండియా, జింబాబ్వే జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వే టాస్ గెలిచింది. జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తొలుత బౌలింగ్ చేయడానికి మొగ్గు చూపాడు. మూడు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌లో ఇప్పటికే 1-0 ఆధిక్యంలో ఉన్న భారత జట్టు, ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించి సిరీస్‌ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది.

జంతర్ మంతర్ లో మిన్నంటిన సంబరాలు- నీట్ మృతులకు నివాళి..!

విద్యార్ధులు ఎట్టకేలకు తమ పంతం నెరవేర్చుకున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటన వెలువడటంతో జంతర్ మంతర్ లో విద్యార్ధుల సంబరాలు మిన్నంటాయి. ముందుగా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్ధాపకుడు అభిజిత్ దిప్కే.. తనకు వచ్చిన ఫోన్ కాల్ ను స్టేజ్ మీదే మాట్లాడి ఈ విషయాన్ని మైక్ లో ప్రకటించారు. దీంతో విద్యార్ధులు సంబరాల్లో మునిగిపోయారు.

కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. నీట్ (NEET) అక్రమాలు వెలుగులోకి రాగానే.. సీబీఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నా. అని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో సుదీర్ఘ […]

సంచలనం: కేంద్రమంత్రి ధర్మేంద్ర రాజీనామా!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా చేశారు. ఈ విష‌యాన్ని ఆయ‌న త‌న ఎక్స్ అకౌంట్‌లో తెలిపారు. కాక్రోచ్ జ‌న‌తా పార్టీ ఆందోళ‌న‌ల నేప‌థ్యంలో మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ వెన‌క్కి త‌గ్గారు. సీజేపీ, కేంద్రం మ‌ధ్య మూడో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌ర‌నున్న నేప‌థ్యంలో ఈ కీల‌క ప‌రిణామం జ‌రిగింది.

సోషల్ మీడియాలో జ్యోతిక…అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్

నటి జ్యోతిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు ఆమె బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. విద్యార్థుల పక్షాన నిలుస్తున్నా.. అంటూ పోస్ట్ పెట్టారు. తన పోస్టులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు తాను సపోర్టు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.

CJP నిరసన హింసాకాండ కేసులో హత్యాయత్నంగా నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

జూలై 20న సీజేపీ నిర్వహించిన ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా చెలరేగిన హింసాకాండకు సంబంధించి నమోదు చేసిన కేసులో ఢిల్లీ పోలీసులు హత్యాయత్నం అభియోగాన్ని మోపారు. ఈ ఘర్షణల్లో పలువురు సీనియర్ అధికారులతో సహా కనీసం 129 మంది పోలీసు సిబ్బంది, సుమారు 60 మంది నిరసనకారులు గాయపడినట్లు సమాచారం. కర్తవ్య పథ్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు FIR నమోదు చేయబడింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON