గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు నన్ను బాధించాయి. నేను వ్యక్తిగత భేషజాలకు పోవడం లేదు. నీట్ (NEET) అక్రమాలు వెలుగులోకి రాగానే.. సీబీఐ విచారణకు ఆదేశించాం. విజయవంతంగా మళ్లీ పరీక్షను నిర్వహించాం. బాధ్యతల నుంచి నేను ఎప్పుడూ తప్పుకోలేదు. యువశక్తే.. ఈ దేశ అసలైన శక్తి. వారి భవిష్యత్తు కోసమే రాజీనామా చేశాను. దేశ యువతపై నాకు పూర్తి నమ్మకం ఉంది. వారి ఆకాంక్షలను గౌరవిస్తున్నా. అని విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ‘ఎక్స్’లో సుదీర్ఘ పోస్టు పెట్టారు.