కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. కేంద్ర కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖల మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ మంత్రిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాక్రోచ్ జనతా పార్టీ, జెన్ జీ ఆందోళనతో కేంద్రం దిగొచ్చింది. నీట్ పేపర్ లీక్ విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కేంద్రం సుమోటోగా తీసుకుని, సీబీఐ ఈ కేసు దర్యాప్తు చేస్తుందని రాజీనామా తరువాత ధర్మేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.