loader

మరింత క్షీణించిన సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం

దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్‌ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు 13 రోజులుగా నిరాటంకంగా సాగుతున్నాయి. ఇక ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఇదే ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది. ఆమరణ దీక్షలో భాగంగా ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) ఒక్కసారిగా 60కి పడిపోవడంతో అక్కడ ఉన్న శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనకు […]

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని శ్రీ రంగనాయకుల మండపంలో వేద పండితులు పవన్ కళ్యాణ్ కి ఆశీర్వచనం చేసి స్వామి వారి చిత్రపటంతో పాటు తీర్ధప్రసాదాలు అందజేశారు. దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ అధికారిక కార్యక్రమం ముగిసిన అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలని తలంచారు. ఇందులో భాగంగా సాయంత్రం దర్శనానికి వెళ్లారు.

వీబీ-జీ-రామ్ జీకి తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వీబీ- జీ-రామ్ జీ చట్టాన్ని రాష్ట్రంలో అమలు చేసేందుకు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం అమలు చేయాలా.. వద్దా.. అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం సుదీర్ఘంగా చర్చ చేసింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రాలను కనీసం సంప్రదించకుండా కేంద్రం తెచ్చిన ఈ చట్టంలో ఉన్న వివాదాస్పద నిబంధనలపై మంత్రివర్గం […]

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..

వైద్య రంగంలో నిరుద్యోగులకు సర్కార్ పెద్ద పీట వేసింది. హైదరాబాద్ నగర నలుమూలలా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్‌లతో పాటు వరంగల్‌లోని టీఐఎమ్ఎస్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏకంగా 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, మరియు 4,235 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు..

ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో సమావేశమైన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు చారిత్రాత్మక, సంక్షేమ నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు మొదటి విడత పనులకు కేబినెట్ అధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 21 కిలోమీటర్ల మేర సాగే ఈ ఫేజ్-1 పనుల కోసం ఏకంగా రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌ను క్లియర్ చేయడంతో పాటు, ఈ ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా 147 కొత్త పోస్టులను మంజూరు చేసింది.

తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. టీచర్లకూ మధ్యాహ్న భోజనం

విద్యాశాఖలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక నిర్ణయానికి కేబినెట్ శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లోని విద్యార్థులకు అందిస్తున్న ఉదయం అల్పాహారం , పాలు , మధ్యాహ్న భోజన సౌకర్యాన్ని ఇకపై అక్కడ విధులు నిర్వర్తించే ఉపాధ్యాయులు, లెక్చరర్లు, ఇతర నాన్-టీచింగ్ స్టాఫ్‌కు కూడా ఉచితంగా వర్తింపజేయాలని నిర్ణయించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.50 లక్షల మంది విద్యాశాఖ సిబ్బందికి నేరుగా లబ్ధి చేకూరనుంది.

రజనీకాంత్ ‘జైలర్ 2’ రిలీజ్ డేట్ ఫిక్స్..

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘జైలర్ 2’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం 2026 అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించారు. “అలప్పర కెలప్పురోమ్!” అంటూ విడుదల చేసిన ప్రత్యేక ప్రోమోలో చిత్ర బృందం రిలీజ్ డేటు ప్రకటించింది. దీంతో తలైవా అభిమానుల్లో ఆనందం నెలకొంది. సోషల్ మీడియాలో #Jailer2From Oct15 హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

అమెరికా హోటల్‌లో అగ్నిప్రమాదం.. గుజరాత్‌కు చెందిన కుటుంబం మృతి

అమెరికాలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లా నాడియాడ్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. ఒహియోలోని ‘ఎకానో లాడ్జ్’లో హితేష్‌భాయ్‌ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది. గురువారం తెల్లవారుజామున ఆ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టంగా కమ్ముకున్న పొగకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు […]

పాకిస్థానీ డ్రామాలో ఇస్లాంకు అవమానం: నటిపై భగ్గుమన్న జనం!

పాకిస్థానీ డ్రామా సీరియల్ ‘జబ్త్’ ప్రస్తుతం ఓ వివాదాస్పద దృశ్యం కారణంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సీరియల్‌పై సోషల్ మీడియాలో భారీ ఎత్తున విమర్శలు వస్తున్నాయి. సీరియల్‌లోని ఓ సీన్ ముస్లింల ధార్మిక భావాలను దెబ్బతీసేలా ఉందంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న నెటిజన్లు ఛానెల్ పై, నటిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నటి కోపంతో నేలపైకి విసిరేసిన పుస్తకాలలో ఓ పుస్తకం “ఇస్లామిక్ స్టడీస్”కు సంబంధించినదిగా ఉంది. పవిత్రమైన మత గ్రంథాలను ఈ విధంగా నేలపైకి […]

కేబినెట్ సమావేశానికి కొండా సురేఖ డుమ్మా

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న కేబినెట్ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరు అయ్యారు. యాదగురిగుట్ట పాలకమండలి విషయంలో ఆమె తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు గత రెండు రోజులుగా అటు ప్రభుత్వంలో, ఇటు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న తనకు కనీస సమాచారం లేకుండానే పాలకమండలి ఛైర్మన్, సభ్యులను నిర్ణయించి ప్రకటించడంతో సురేఖ కినుక వహించినట్లు చెబుతున్నారు. ఈ రోజు ఆమె విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ వచ్చినా, మంత్రి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON