దేశ రాజధాని దిల్లీ వేదికగా జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఆందోళనలు 13 రోజులుగా నిరాటంకంగా సాగుతున్నాయి. ఇక ఉద్యమకారుడు, పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్ చుక్ ఇదే ప్రాంగణంలో ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించి ఇప్పటికి ఐదు రోజులు అవుతుంది. ఆమరణ దీక్షలో భాగంగా ఆయన రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) ఒక్కసారిగా 60కి పడిపోవడంతో అక్కడ ఉన్న శ్రేణులు ఆందోళనకు గురయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే వైద్యులు ఆయనకు అత్యవసర చికిత్స అందించారు