వైద్య రంగంలో నిరుద్యోగులకు సర్కార్ పెద్ద పీట వేసింది. హైదరాబాద్ నగర నలుమూలలా నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు.. సనత్ నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్‌లతో పాటు వరంగల్‌లోని టీఐఎమ్ఎస్ ఆసుపత్రులను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ఏకంగా 6,278 పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో 1,494 రెగ్యులర్ పోస్టులు, 549 కాంట్రాక్ట్ పోస్టులు, మరియు 4,235 అవుట్‌సోర్సింగ్ పోస్టులు ఉన్నాయి.