అమెరికాలోని ఒక హోటల్‌లో అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ పనిచేస్తూ నివసిస్తున్న గుజరాత్‌కు చెందిన భార్యాభర్తలు, వారి కుమార్తె మరణించారు. గుజరాత్‌లోని ఖేడా జిల్లా నాడియాడ్‌కు చెందిన హితేష్‌భాయ్ సుతార్, ఆయన భార్య హీనాబెన్, 20 ఏళ్ల కుమార్తె ఇషాని రెండేళ్ల కిందట అమెరికాలో స్థిరపడ్డారు. ఒహియోలోని ‘ఎకానో లాడ్జ్’లో హితేష్‌భాయ్ పనిచేస్తుండటంతో ఆ కుటుంబం అక్కడ నివసిస్తున్నది. గురువారం తెల్లవారుజామున ఆ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. దట్టంగా కమ్ముకున్న పొగకు ఊపిరాడక ఆ కుటుంబంలోని ముగ్గురు మరణించినట్లు అధికారులు తెలిపారు.