గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు ఒక వ్యాపారవేత్త కోసమే: రాహుల్ గాంధీ
గ్రేట్ నికోబార్ దీవి అభివృద్ధి ప్రాజెక్టు రక్షణ అవసరాలు లేదా ట్రాన్స్‌షిప్‌మెంట్ పోర్టు కోసం కాదని, ఒక వ్యాపారవేత్త ప్రయోజనాల కోసమే కేంద్ర ప్రభుత్వం దీనిని ముందుకు తీసుకెళ్తోందని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం గ్రేట్ నికోబార్ ద్వీపాన్ని నాశనం చేస్తోందని ఆయన ఆరోపించారు. కోట్లాది చెట్లు, విలువైన పగడపు దిబ్బలు, తిరిగి పొందలేని వర్షారణ్యాలు ఒక వ్యాపారవేత్త లాభం కోసం ధ్వంసం చేయబడుతున్నాయని పేర్కొన్నారు.

