కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ పూరి అండమాన్ దీవుల్లో భారీగా గ్యాస్ నిక్షేపాలు ఉన్నట్లు వెల్లడించారు. అండమాన్ దీవులు తూర్పు తీరానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ విజయపురం-3 వద్ద సహజ వాయువు నిక్షేపాలను కనుగొన్నట్లు తెలిపారు. 355 మీటర్ల నీటి లోతులో ఈ సహజ వాయువును కనుగొన్నట్లు తెలిపిన కేంద్ర మంత్రి.. 1900 మీటర్లకు పైగా లోతులో నిర్వహించిన ప్రాథమిక ఉత్పత్తి పరీక్షలలో, నిరంతర ఫ్లేరింగ్ ద్వారా సహజ వాయువు ఉనికిని నిర్ధారించినట్లు స్పష్టం చేశారు.