రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక వడ్డీరేట్లను మరోసారి యథాతథంగా ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాలను ఆర్బీఐ (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుక్రవారం వెల్లడించారు. ఈసారి రెపో రేటులో ఎలాంటి మార్పు లేదని, 5.25శాతం వద్దే కొనసాగిస్తున్నట్లు తెలిపారు. కీలక వడ్డీరేట్లను ఆర్బీఐ సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.

