జనసేన పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ పేరును పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఖరారు చేశారని పార్టీ ఓ ప్రకటన చేసింది. జనసేన పార్టీతో, పవన్ కళ్యాణ్ తో 2015 నుంచి రమేష్ కి అనుబంధం ఉందని పేర్కొంది. అలాగే రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అన్ని సామాజిక వర్గాల మధ్య సఖ్యత, అందుకు తగ్గ సోషల్ ఇంజినీరింగ్ అవసరమనే పవన్ కళ్యాణ్ ఆలోచనలకు ఆకర్షితులైన రమేష్, ఆయన వెన్నంటి ఉన్నారని వెల్లడించింది.