loader

సీబీఎస్‌ఈ చైర్మన్, కార్యదర్శిపై బదిలీ వేటు

12వ తరగతి పరీక్షల డిజిటల్ మూల్యాంకన వ్యవస్థలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) చైర్మన్ రాహుల్ సింగ్, కార్యదర్శి హిమాంశు గుప్తాలపై బదిలీ వేటు వేసింది. అంతేకాకుండా ఇప్పటి వరకు దారి తీసిన పరిణామాలు, అవకతవలపై అత్యున్నత స్థాయి విచారణకు ఆదేశించింది. వారి స్థానంలో సీబీఎస్‌ఈ చైర్మన్‌గా సీనియర్ ఐఎఎస్ అధికారి లోఖాండే ప్రశాంత్ సీతారామ్, కార్యదర్శిగా సీనియర్ బ్యూరోక్రాట్ వరుణ్ భరద్వాజ్‌ను కేంద్ర ప్రభుత్వం […]

సీఎం విజయ్ దళపతి పోస్టర్‌‌ను కూడా వదలని నటి త్రిష.!.

త్రిష సీఎం విజయ్ దళపతి పోస్టర్ కు సెల్యూట్ చెప్పిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నటి త్రిష సీఎం విజయ్ దళపతి పోస్టర్ ను చూశారు. ఆ తర్వాత పోస్టర్ మీద ఉన్న విజయ్ బుగ్గల మీద చెయ్యి వేశారు. అంతటితో ఆగకుండా సెల్యూట్ చేశారు. సీఎం విజయ్ స్టైల్ ను ఇమిటేట్ కూడా చేశారు. దీనిపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. పోస్టర్ ను కూడా వదలవా అంటూ త్రిషను ట్రోల్స్ […]

గిఫ్ట్ ఏ స్మైల్.. విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ చేసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గిఫ్ట్ ఏ స్మెల్ కార్యక్రమంలో భాగంగా సిరిసిల్ల విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. సిరిసిల్ల నియోజకవర్గంలో టెన్త్ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన మొదటి 30 మంది విద్యార్థులకు సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్లను పంపిణీ చేసి అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఈ ప్రోత్సాహకాలు మరింత ఉన్నత లక్ష్యాలను సాధించేందుకు స్ఫూర్తినిస్తాయని చెప్పారు. నేటి డిజిటల్ యుగంలో టెక్నికల్ నాలెడ్జ్ […]

ఘోర ప్రమాదం.. ఏడుగురు సజీవ దహనం

గుజరాత్‌లోని సూరత్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొని పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో 7 మంది సజీవ దహనమయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ధూలే నుంచి నవాపూర్ మీదుగా సూరత్‌కు వెళ్తున్న మహారాష్ట్ర ఎస్టీ బస్సు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ధాటికి బస్సు సెంట్రల్ డివైడర్‌ను దాటి ఎదురుగా వస్తున్న మరో మహారాష్ట్ర బస్సును ఢీకొట్టింది. బస్సుల్లో ఒకటి పలుమార్లు పల్టీలు […]

రాహుల్‌కు కూడా తెలంగాణ‌కు వ‌చ్చే అర్హ‌త లేదా?: బీజేపీ నేత విష్ణు వ‌ర్ధ‌న్‌

పవన్ కల్యాణ్ పై పొన్నం వ్యాఖ్యలపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత దేశంలో పుట్టిన పవన్ కల్యాణ్ కు తెలంగాణలో అడుగు పెట్టే అర్హత లేదని ఎలా అంటారని ప్రశ్నించారు. పొన్నం ప్రభాకర్ ప్రకారం ఈ దేశంలో జన్మించని సోనియా గాంధీ, ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలు ఎదుర్కొన్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో పుట్టిన ఖర్గేలకు కూడా తెలంగాణలోకి వచ్చే అర్హత లేదంటావా అంటూ ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సొంత రాజ్యాంగం అమలవుతుందా? […]

తృణమూల్ లో చీలిక- 50 ఎమ్మెల్యేల వేరుకుంపటి.! శివసేన తరహాలో..!

తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చీలిక ముప్పు కనిపిస్తోంది. పార్టీ నుండి సస్పెండ్ అయిన     నాయకుడు రిజు దత్తా ఈ మేరకు సంచలన ప్రకటన చేశారు. పార్టీ భవిష్యత్తుపై 50 మంది ఎమ్మెల్యేలు     ఒక హోటల్‌లో రహస్య చర్చలు జరిపారని వీరు పశ్చిమ బెంగాల్ స్పీకర్‌ను కలిసి     మూడు కీలక డిమాండ్లను ముందుకు తెస్తారని తెలిపారు.    తామే “అసలైన తృణమూల్” అని ప్రకటించుకోవడం, పార్టీ గుర్తుపై తమకు హక్కు ఉందని వాదించడం,     ప్రతిపక్ష నాయకుడు రితబ్రత బందోపాధ్యాయ […]

రేవంత్ రెడ్డి, పవన్‌ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

తెలంగాణ ప్రజలే మీకు బువ్వ పెట్టిర్రు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని సాదారు. పవన్‌ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీ గురించిఎవరు మాట్లాడితే వాళ్ల గురించి మాట్లాడు.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రేవంత్‌ రెడ్డి, పవన్‌ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నరని ఆరోపించారు. కాంగ్రెస్‌ పార్టీ, పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు.

మీ అయ్య జాగీరా అడ్డుకుంటామని బెదిరించడానికి?.. పవన్ సంచలన కామెంట్స్

ప్రతిసారీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నా విజ్ఞప్తి, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం.  హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్‌, ఇక్కడేం పని అని అడుగుతున్నారు. మీరెవరు నన్ను బెదిరించడానికి, మీ అయ్య జాగీరా తెలంగాణ? తెలంగాణ బెదిరింపుల కంటే ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. అక్కడ తల తీసేయమంటారు. తెలంగాణ కొత్తగా బావుకునేది లేదు. నా  ఇంటి అడ్రెస్ చెప్పేందుకే ఇక్కడ ప్రెస్‌మీట్ పెట్టాను. ఎవరైనా దాడి చేసుకోవచ్చు. భయపడే వాడిని కాదు.

రేవంత్ రెడ్డి గారూ, ఆ చెరువు పక్కన స్థలం తీసుకోండి! పవన్ కల్యాణ్ ఓపెన్ ఆఫర్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్ సంచలనంగా మారుతుంది.హైదరాబాద్‌లోని కోడి చెరువు కబ్జా పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. తాను ఆక్రమణలు పాల్పడినట్టు నిరూపిస్తే ఆ భూమిని తక్షణమే ప్రభుత్వానికి రాసి ఇస్తానని అన్నారు. ఆ ప్రాపర్టీని ప్రభుత్వం సీజ్ చేయవచ్చని కూడా సూచించారు. అంతే కానీ అక్కడి ప్రైవేటు వ్యక్తులు రావడం చట్ట విరుద్దమని వార్నింగ్ ఇచ్చారు. అలాంటి వారు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.

SIR పై శిక్షణ..SIR పై అప్రమత్తత అవసరం ..చంద్రబాబు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెదేపా ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘సర్’ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మాకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలు ఉంటే సరికాదు. జనసేన, భాజపాతో కలిసి సమన్వయం చేసుకొని ‘సర్’ని పర్యవేక్షించాలన్నారు. తెదేపా ప్రధాన పార్టీగా ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ‘సర్పై తెదేపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని నేతలపై […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON