తెలంగాణ ప్రజలే మీకు బువ్వ పెట్టిర్రు. తెలంగాణ ప్రజలే మిమ్మల్ని సాదారు. పవన్ కల్యాణ్ కామెంట్స్ నేపథ్యంలో జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మీ గురించిఎవరు మాట్లాడితే వాళ్ల గురించి మాట్లాడు.. ప్రస్తుత పరిస్థితిని చూస్తే రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ మ్యాచ్ ఫిక్సింగ్‌తో ప్రజలను మోసం చేస్తున్నరని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ, పవన్ కల్యాణ్ కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి తెలంగాణ ప్రజలను మోసం చేసేందుకు ఆడుతున్న డ్రామా తప్ప మాకు ఇందులో ఇంకోటి కనిపిస్తలేవన్నారు.