ప్రతిసారీ తెలంగాణ గురించి మాట్లాడుతుంటే విమర్శిస్తున్నారు. అలాంటి వ్యక్తులకు నా విజ్ఞప్తి, జనసేన తెలంగాణ నడిబొడ్డులో పెట్టాం. హైదరాబాద్‌లో ఎలా అడుగు పెడతావ్, ఇక్కడేం పని అని అడుగుతున్నారు. మీరెవరు నన్ను బెదిరించడానికి, మీ అయ్య జాగీరా తెలంగాణ? తెలంగాణ బెదిరింపుల కంటే ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. అక్కడ తల తీసేయమంటారు. తెలంగాణ కొత్తగా బావుకునేది లేదు. నా ఇంటి అడ్రెస్ చెప్పేందుకే ఇక్కడ ప్రెస్‌మీట్ పెట్టాను. ఎవరైనా దాడి చేసుకోవచ్చు. భయపడే వాడిని కాదు.