ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని తెదేపా ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ‘సర్’ సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మాకేం సంబంధం లేదన్నట్లుగా ఎంపీలు ఉంటే సరికాదు. జనసేన, భాజపాతో కలిసి సమన్వయం చేసుకొని ‘సర్’ని పర్యవేక్షించాలన్నారు. తెదేపా ప్రధాన పార్టీగా ఉన్నందున పూర్తి అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ‘సర్పై తెదేపా ఎమ్మెల్యేలకు చంద్రబాబు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణ తరగతులకు హాజరుకాని నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.