కాపు సంఘాల నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ముద్రగడ పద్మనాభ రెడ్డి కుమార్తె, జనసేన పార్టీ నేత క్రాంతి కౌంటరిచ్చారు. మీరు కేవలం కాపు కులం గురించే మాట్లాడుతున్నందున ఈరోజు జనసేన పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేలలో 10 మంది కాపులే, ఇద్దరు ఎంపీలు, ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా అదే వర్గానికి చెందినవారు. నిజానికి ఈ కాపు సంఘ నాయకుల వల్ల కాపులు ఎంత నష్టపోయారో కొత్తగా చెప్పాల్సిందేమీ లేదు. ఇలాంటివారి పట్ల అప్రమత్తంగా లేకపోతె ఇంకా నష్టపోతాం అని అన్నారు క్రాంతి.