బీహార్‌లోని వైశాలి జిల్లాలో మూడు దశాబ్దాల క్రితం చోటుచేసుకున్న ఒక తీవ్రమైన దాడి కేసుకు సంబంధించి స్థానిక న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఐదుగురు నిందితులు ఉండగా.. సుదీర్ఘ కాలం పాటు సాగిన విచారణ కారణంగా నలుగురు నిందితులు కాలం చేశారు. చివరకు మిగిలిన ఏకైక నిందితుడైన 84 ఏళ్ల వృద్ధుడు దీప్ రాయ్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. శారీరకంగా బలహీనపడిన సదరు వృద్ధుడిని ఇద్దరు వ్యక్తులు పట్టుకుని కోర్టు వెలుపలికి తీసుకువస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.