ఇంటికి మంటలు అంటుకోవడంతో ఇద్దరు మహిళలు సజీవదహనమైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా వేలేరుపాడులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వేలేరుపాడులో సావిత్రి(65) అనే మహిళ తన చెల్లి పూలమ్మ(60) తో కలిసి ఉంది. ఇంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఇద్దరు మహిళలు
సజీవదహనమయ్యారు. పక్కన ఉండే రెండు ఇండ్లకు కూడా మంటలు అంటుకున్నాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.