హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి, బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ కళాకారులకు కేటీఆర్ సన్మానం చేశారు.