తెలంగాణ అవతరణ దినోత్సవం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన అధికారిక వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని సగానికే ముగించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇంకా ఐదు పేజీల అధికారిక ప్రసంగ పాఠం మిగిలి ఉండగానే ఆయన తన ప్రసంగానికి స్వస్తి పలికారు. భానుడి భగభగల కారణంగా పరేడ్ గ్రౌండ్స్ లో ఎండ తీవ్రత విపరీతంగా పెరగడంతో, అక్కడకు వచ్చిన ప్రజలు, అధికారులు, సిబ్బంది ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే తాను ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేస్తున్నట్లు ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు.