త్యాగాల చరిత్రకు న్యాయం జరిగిన రోజు.. అవమానాల అధ్యాయానికి ముగింపు పలికిన రోజు.. తెలంగాణ ఆత్మగౌరవ పతాకం సగర్వంగా ఎగిరిన రోజు.. నాలుగు కోట్ల ప్రజల ఆత్మగౌరవ ఆకాంక్షలు సాకారమైన రోజు నేడు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు తెలిపారు. తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉండాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.