కేంద్ర జలశక్తి శాఖ విడుదల చేసిన డైనమిక్ గ్రౌండ్‌వాటర్ రీసోర్స్ అసెస్మెంట్ రిపోర్ట్ 2025 ప్రకారం హైదరాబాద్ నగరంలోని మొత్తం 16 మండలాల్లో 15 మండలాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. రాజస్థాన్‌లోని ఎడారి జిల్లాలైన బార్మర్, జైసల్మేర్, పంజాబ్‌లోని డార్క్ జోన్ జిల్లాలను తలపించేలా భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. సికింద్రాబాద్, ఖైరతాబాద్, అమీర్‌పేట్, హిమాయత్‌నగర్, ముషీరాబాద్, నాంపల్లి, షేక్‌పేట్, సైదాబాద్ వంటి కీలక మండలాలు ఈ ప్రమాదకర జాబితాలో ఉన్నాయి. నగరంలో 1500 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు పడటం లేదు.