అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
అమెరికాలోని అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న 13 మంది విద్యార్థులు బర్మింగ్‌హామ్‌లోని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఉంటున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఉడుముల సహజ రెడ్డి, కూకట్‌పల్లికి చెందిన మరో విద్యార్థి ఉంటున్నారు. శుక్రవారం అపార్ట్‌మెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తెలుగు విద్యార్థులిద్దరూ తీవ్రంగా గాయపడ్డంతో అగ్నిమాపక సిబ్బంది వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.

