ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం ఇప్పట్లో సమసిపోయేలా లేదు. వందల సంఖ్యలో సర్వీస్ల రద్దుతో ప్రయాణికులు అగచాట్లు పడుతున్న వేళ.. ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బెర్స్ (Pieter Elbers) కీలక ప్రకటన చేశారు. ఊహించని అంతరాయానికి తమను క్షమించాలని కోరిన ఆయన.. ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందుకు నా తరఫున, మా సంస్థ ఇండిగో తరఫున మీఅందరికీ క్షమాపణలు తెలియజేస్తున్నా. ఇండిగోలో సాధారణ పరిస్థితులు నెలకొనడానికి కనీసం పది రోజులు పట్టేలా ఉంది. డిసెంబర్ 10-15 వరకూ సర్వీస్లు యథావిధిగా నడిచే అవకాశముంది’ అని పీటర్స్ పేర్కొన్నారు.