ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన విమానాలు పెద్ద సంఖ్యలో రద్దు కావడం. మిగతా విమానయాన సంస్థలకు తమ టికెట్ ధరలను భారీగా పెంచేందుకు ఒక అవకాశంగా మారింది. కొన్ని ప్రధాన రూట్ల ధరలు షాక్‌కు గురిచేస్తున్నాయి. ఉదాహరణకు, హైదరాబాద్-ఢిల్లీ మార్గంలో సాధారణంగా రూ. 6,000 నుంచి రూ. 7,000 మధ్య ఉండే విమాన టికెట్ ధర ఏకంగా రూ. 40,000కు చేరింది. అదే విధంగా, హైదరాబాద్-ముంబై రూట్లో కూడా టికెట్ ధర రూ. 37,000గా ఉంది.