loader

టైటిల్ పోరుకు అమందా

ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో గురువారం పెను సంచలనం నమోదైంది. మహిళల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్ అరినా సబలెంక (బెలారస్) సెమీ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. ఉత్కంఠభరితంగా సాగిన తొలి సెమీ ఫైనల్లో అమెరికాకు చెందిన యువ సంచలనం, 13వ సీడ్ అమందా అనిసిమోవా 64, 46, 64 తేడాతో సబలెంకను మట్టికరిపించింది. అసాధారణ ఆటతో అలరించిన అమందా చిరస్మరణీయ విజయంతో కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది.

బీసీలకు 42% రిజర్వేషన్లు, పంచాయతీరాజ్ చట్ట సవరణ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో గురువారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో కీలక సవరణలకు కేబినెట్ ఆమోదం తెలిపింది బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల నిర్ణయానికి ఆమోదం తెలిపింది. త్వరలోనే దీనిపై ప్రత్యేక ఆర్డినెన్స్‌ జారీ చేయనుందని సమాచారం. దీని కోసం ఇప్పటికే అసెంబ్లీని గవర్నర్ ప్రోరోగ్ చేసినట్టు తెలుస్తోంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ప్రభుత్వం పనిచేస్తోంది.

అమెరికాలో కూలీలకు తప్పిన ముప్పు

అమెరికాలోని లాస్ ఎంజిలెస్ ప్రాంతంలో 31 మంది నిర్మాణ కార్మికులకు గండం గడిచింది. ఇండస్ట్రియల్ టన్నెల్‌నిర్మాణ పనులలో ఉన్న వీరిపై పై కప్పు కొంతభాగం కూలింది. ఏకైక మార్గం గుండానే కార్మికులు లోపలికి వెళ్లుతారు. తొమ్మిది కిలోమీటర్ల లోపల కార్మికులు పనుల్లో ఉండగా ప్రమాదం జరిగింది. పూర్తిగా బురదమయంగా ఉన్న నేలపై నుంచే కార్మికులు అష్ఠకప్టాలు పడి ముందుకు ముఖద్వారం వద్దకు చేరుకున్నారు. వెంటనే వీరిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

టెన్నిస్ క్రీడాకారిణి రీల్స్ చేస్తుందని.. కన్నతండ్రి దారుణం

రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె కన్నతండ్రే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికి అలవాటు పడటంతో తన కూతురు రాధికను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని తెలుస్తోంది. రాధిక యాదవ్ హర్యానా టెన్నిస్ సర్క్యూట్‌లో రాష్ట్రస్థాయి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు పోటీల్లో పాల్గొని మంచి విజయాలు సాధించింది.ప్లేయర్ గానే కాకుండా.. టెన్నిస్ అకాడమీని కూడా నడుపుతోంది. అక్కడ పలువురు ఔత్సాహిక ఆటగాళ్లకు ఆమె శిక్షణ కూడా ఇస్తోంది.

పొలాల్లో పడి ఉన్న రెండేళ్ల బాలుడు..

ప్రకాశంజిల్లా కంభం మండలం లింగోజి పల్లి గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. రెండు రోజుల క్రితం అంగన్వాడి కేంద్రానికి వెళ్లి అదృశ్యమైన మూడేళ్ళ బాలుడు లక్షిత్ గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పొలాలలో బాలుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి కోసం 10 పోలీసు బృందాలు గాలించగా చివరకు బాలుడి మృతదేహం లభించింది.ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి అక్కడ పడవేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

NEET UG 2025: తెలంగాణ మెరిట్ జాబితా విడుదల!

NEET UG 2025కు సంబంధించిన తెలంగాణలో విద్యార్థులు సాధించిన మెరిట్ జాబితా విడుదలైంది. తెలంగాణ నీట్ యుజి 2025 రాష్ట్ర మెరిట్ జాబితా పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే అభ్యర్థులు knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. వెబ్‌సైట్‌లో నీట్ రాసిన అభ్యర్థుల రాష్ట్ర స్థాయి ర్యాంకులను ఉంచారు. MBBS, BDS కౌన్సెలింగ్ అర్హత ఇతర వివరాల కోసం అభ్యర్థులు వెబ్‌సైట్‌లోకి వెళ్లి చెక్కు చేసుకోవాలి. వారి పేర్లు, ర్యాంకుల వివరాలు ఉంచారు

విజయసాయిరెడ్డికి SIT మరోసారి నోటీసులు

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో సీఐడీ సిట్ దూకుడు చూపిస్తోంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. 12వ తేదీ ఉదయం విచారణకు హాజరు కావాలని సిట్ నోటీసుల్లో ఆదేశించింది. విజయసాయిరెడ్డిని లిక్కర్ కేసులో గతంలోనూ ఓ సారి సిట్ ప్రశ్నించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలంగా ఉన్నట్లుగా గుర్తించారు. అందుకే మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లుగా తెలుస్తోంది.

గాల్లో ఢీ కొన్న శిక్షణ విమానాలు.. కేరళ యువకుడు మృతి

కెనడా మానిటోబాలో రెండు శిక్షణ విమానాలు గాల్లో ఢీ కొన్నాయి శిక్షణ సమయంలో రెండు సింగిల్‌ ఇంజిన్‌ విమానాలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన పైలట్లలో కేరళకు చెందిన 23 ఏళ్ల విద్యార్థి శ్రీహరి సుకేశ్‌గా వెల్లడించింది. టేకాఫ్‌, ల్యాండింగ్‌లను ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు శిక్షణ స్కూల్‌ అధ్యక్షుడు ఆడమ్‌ పెన్నర్‌ తెలిపారు. ఒకే సమయంలో ల్యాండ్‌ చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

నా లాగా ఎవరూ మోసపోవద్దు..

హైదరాబాద్‌ KPHBలో నివాసం ఉంటున్న అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ అంటూ ప్రకటన చూసి సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కట్టింది. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్‌ నేరగాళ్లు చెప్పారు. చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూష బంగారం అమ్మి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత […]

మాధవ్ గిఫ్ట్‌పై మండిపడుతూ కేటీఆర్ పోస్ట్

ఏపీ బీజేపీ అధ్యక్షుడు లోకేష్‌కి అందజేసిన భారతదేశ మ్యాప్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వేర్వేరు రాష్ట్రాలుగా విభజించి లేవని. ఆంధ్రప్రదేశ్‌ని ఉమ్మడి రాష్ట్రంగానే చూపిస్తున్నట్లుగా ఉండటాన్ని తప్పుపట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈఫోటోని తన సోషల్ మీడియా పేజ్ లో షేర్ చేస్తూ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వానికి, ఆపార్టీకి ఉన్న చిత్తశుద్దిని శంకిస్తూ కొన్ని అంశాలను ప్రస్తావించారు. బీజేపీ చీఫ్ అందజేసిన చిత్రపటంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON