రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిని ఆమె కన్నతండ్రే తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేయడానికి అలవాటు పడటంతో తన కూతురు రాధికను హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడని తెలుస్తోంది. రాధిక యాదవ్ హర్యానా టెన్నిస్ సర్క్యూట్‌లో రాష్ట్రస్థాయి ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకుంది. పలు పోటీల్లో పాల్గొని మంచి విజయాలు సాధించింది.ప్లేయర్ గానే కాకుండా.. టెన్నిస్ అకాడమీని కూడా నడుపుతోంది. అక్కడ పలువురు ఔత్సాహిక ఆటగాళ్లకు ఆమె శిక్షణ కూడా ఇస్తోంది.

