హైదరాబాద్ KPHBలో నివాసం ఉంటున్న అనూష టెలిగ్రామ్ యాప్‌లో వర్క్‌ఫ్రమ్ హోమ్ అంటూ ప్రకటన చూసి సైబర్ నేరగాళ్ల మాయమాటలు నమ్మి కొంత నగదు కట్టింది. బ్యాంకు ఖాతాలోకి డబ్బులు బదిలీ అవ్వాలంటే ఇంకా కొంత
డబ్బులు పెట్టుబడి పెట్టాలని సైబర్ నేరగాళ్లు చెప్పారు. చెప్పిన మాటలకు ఆకర్షితురాలైన అనూష బంగారం అమ్మి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు పెట్టింది. చివరికి తాను సైబర్ నేరగాల మోసానికి బలి అయ్యానని గుర్తించింది. సైబర్ మోసానికి అనూష కలత చెందింది. ఇంట్లో ఫ్యాన్‌కి ఉరి వేసుకుంది.

