బెంగాల్, అస్సాం ఎన్నికల ఫలితాల్లో భాజపా ఇప్పటికే ఆధిక్యాల్లో మ్యాజిక్ ఫిగర్ దాటింది. ఈ నేపథ్యంలో దేశంలోని ఏఏ రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందో తెలిపేలా మ్యాప్‌ను పోస్ట్ చేసింది. ‘‘కాషాయ పార్టీ ఇప్పుడు బెంగాల్‌కు చేరింది. ఇది కేవలం విస్తరణ మాత్రమే కాదు.. అభివృద్ధి కోసం జాతి తమపై ఉంచిన నమ్మకం. నార్త్ టు నార్త్‌ఈస్ట్ వరకు సాగుతున్న రాజకీయ రంగు మార్పులో బెంగాల్ తాజా అధ్యాయం మాత్రమే’’ అని పేర్కొంది.

