loader

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ వాడాలి: సిఎం

భూభారతి పేద రైతులకు చుట్టమని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు, అధికారులతో సిఎం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇళ్లు, భూభారతిపై ఈ సమీక్షలో చర్చించారు. క్షేత్రస్థాయిలో ప్రాక్టికల్ సమస్యలను గుర్తించి పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీని వాడాలని సూచించారు. 29, 30 తేదీల్లో ఇన్‌ఛార్జ్ […]

పవన్‌కు థాంక్స్ చెబుతూ దిల్ రాజు లెటర్…

సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం అనే అంశం మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ‘దిల్’ రాజు తెలిపారు. సినిమా థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలసికట్టుగా తోడ్పడుతుందని ‘దిల్’ రాజు వివరించారు

జ్యోతి మల్హోత్రా పాకిస్తానీ మిత్రులు ఐఎస్‌ఐ ఏజెంట్లే

జ్యోతి మల్హోత్ర నుంచి మూడు ఫోన్ల నుంచి,, కీలకమైన డేటా స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు రికవరీ చేసిన డేటాలో ఆమె చాట్ రికార్డులు, కాల్ వివరాలు, వీడియో ఫుటేజ్ తో పాటు నలుగురు ఏజెంట్లతో ఆమె జరిపిన ఆర్థిక లావాదేవీల వివరాలు వెలుగులోకి వచ్చాయి. జ్యోతి మల్హోత్రా కు నలుగురు పాకిస్తానీ నిఘా కార్యకర్తలతో ప్రత్యక్ష సంబంధం ఉందని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. ఆమె పాకిస్తాన్ లో పర్యటించనప్పుడల్లా ప్రత్యేక మర్యాదలు […]

ఐదు రోజులైనా ఉలుకూ పలుకూ లేదు! కవితపై చర్యలు తీసుకుంటారా?

అలుపెరుగని రాజకీయ శిఖరానికి కూతురు పేరుతో గండం ముంచుకొచ్చింది అసమ్మతి స్వరంతో కేసీఆర్‌కు కవిత లేఖ రాస్తే, ఐదు రోజుల క్రితం లేఖ మీడియాకు చిక్కింది. అలా చిక్కిన లేఖపై అనేక కథనాలు,విమర్శలు నేటీకి షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఒక్కరంటే ఒక్కరు కూడా కవిత లేఖపై నోరుమెదపలేదు. బీఆర్‌ఆర్ నేతలు అంత సహాసం ఎలా చేస్తారనే సందేహం రావొచ్చు. కానీ గులాబీ బాస్ కేసీఆర్‌ సైతం ఇంత జరుగుతున్నా మౌనంగా ఉన్నారు.

నాకెందుకు స్వామీ ఈ పరీక్ష .. మంచు విష్ణు వైరల్ పోస్ట్

మా సంస్థతో ఎలాంటి సంబంధం లేని చరిత అనే మహిళ చోరీకి పాల్పడింది. ఇది కాకతాళీయంగా జరిగిందో.. పొరపాటున జరిగిందో కాదు.. కచ్చితంగా ఇది వెన్నుపోటే. ‘కన్నప్ప’ మూవీ ప్రమోషన్లలో తీరిక లేకుండా గడుపుతోన్న మంచు విష్ణుకు ఈ సమస్య కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. దీంతో ఆ పరమశివుడిని ప్రశ్నిస్తూ… ‘జటాజూటధారీ, నీకోసం తపస్సు చేసే నాకెందుకు ఈ పరీక్ష స్వామీ?’ #హరహరమహదేవ’ అంటూ ట్వీట్ చేశారు. మంచు విష్ణుకు వచ్చిన ఈ పరిస్థితి చూసి ఫ్యాన్స్‌ […]

చైనా, పాకిస్తాన్ నుంచి భారీ ముప్పు, ఇండియాకు అమెరికా హెచ్చరిక

ఇండియాకు పొరుగు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ముప్పు పొంచి ఉందనేది అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక 2025 వరల్డ్ త్రెట్ అసెస్‌మెంట్ ఆ నివేదిక సారాంశం. నివేదిక ఇప్పుడు ఇండియాకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ముఖ్యంగా దేశానికి చైనా, పాకిస్తాన్ దేశాల నుంచి పొంచి ఉందని వివరించింది. ఈ రెండు దేశాలు ఇండియాకు వ్యతిరేకంగా తమ దేశంలోని సైనిక సామర్ధ్యాల్ని ఆధనీకరించడం, విస్తరించడం చేస్తున్నాయని వెల్లడించింది.

మహానాడు అంటే గుర్తుకు వచ్చేది టీడీపీనే- పవన్ కల్యాణ్

మహానాడు… ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనేనని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ అన్నారు. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు చంద్రబాబు , నారా లోకేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెప్పారు

ఆర్సీబీ టాప్ 2లో ఉండాలంటే గెలవక తప్పని మ్యాచ్

ఐపీఎల్ 2025 చివరి దశకు చేరింది. ఇవాళ్టితో లీగ్ దశ పూర్తి కానుంది. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆర్సీబీకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరినప్పటికీ ఇవాళ గెలిస్తే టాప్ 2 లో చేరుతుంది. క్వాలిఫయర్ 1 లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా వెనక్కి వెళ్లదు. ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందుకే టాప్ 2 అనేది ఐపీఎల్‌లో చాలా […]

సినిమా హాళ్ల బంద్‌పై కీలక ప్రకటన.. పవన్ కళ్యాణ్ సంచలన ఆదేశాలు

రాష్ట్రంలో సినిమా హాళ్ల నిర్వహణను పకడ్బందీగా చేపట్టడం ద్వారా ప్రేక్షకులకు మెరుగైన సేవలు అందించాలని… ఆ దిశగా సంబంధిత ప్రభుత్వ శాఖలు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కొత్త చిత్రాలు విడుదల సందర్భంలో టికెట్ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించినవారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

2 అరుదైన రికార్డులకు అడుగు దూరంలో కోహ్లీ..

2025లో విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ తో . భారీగా పరుగులు చేస్తూ జట్టు విజయంతో కీలక పాత్ర పోషిస్తున్నాడు. కోహ్లీ మరో రెండు రికార్డులకు అడుగు దూరంలో ఉన్నాడు. లక్నోతో జరగబోయే మ్యాచ్ లో కోహ్లీ 24 పరుగులు చేస్తే టీ20ల్లో బెంగళూరు తరఫున 9 వేల పరుగులు చేసిన బ్యాటర్‌గా అలాగే మరో అర్ధశతకం కొడితే ఐపిఎల్‌ చరిత్రలో అత్యధిక హాఫ్‌సెంచరీలు బాదిన బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు సృష్టిస్తాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON