ఐపీఎల్ 2025 చివరి దశకు చేరింది. ఇవాళ్టితో లీగ్ దశ పూర్తి కానుంది. ఆర్సీబీ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ఆర్సీబీకు అత్యంత కీలకంగా మారింది. ఇప్పటికే ప్లే ఆఫ్‌కు చేరినప్పటికీ ఇవాళ గెలిస్తే టాప్ 2 లో చేరుతుంది. క్వాలిఫయర్ 1 లో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరుతుంది. ఒకవేళ ఓడినా వెనక్కి వెళ్లదు. ఫైనల్ చేరేందుకు మరో అవకాశం ఉంటుంది. అందుకే టాప్ 2 అనేది ఐపీఎల్‌లో చాలా కీలకం.

