సగటు సినిమా ప్రేక్షకులను థియేటర్లకు తీసుకు రావడం అనే అంశం మీద పవన్ కళ్యాణ్ ఆలోచనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని ‘దిల్’ రాజు తెలిపారు. సినిమా థియేటర్లలో స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలను అందరికీ అందుబాటులోకి తేవాలన్న పవన్ అభిప్రాయం అభినందనీయమని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూచించిన అన్ని అంశాలపై తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తెలుగు సినిమా అభివృద్ధికి నిర్మాతల మండలి కలసికట్టుగా తోడ్పడుతుందని ‘దిల్’ రాజు వివరించారు

