165 ఏళ్ల నుంచి మిస్టరీగా ఉన్న రీమన్ సిద్ధాంతాన్ని ఆంథ్రోపిక్ క్లాడ్ ఏఐ సహాయంతో ఛేదించినట్లు మ్యాథమెటీషియన్ లీవెంట్ ఆల్పేజ్ ప్రకటించుకున్నారు. తాను ఊహించినదానికంటే క్లాడ్ అద్భుతంగా పనిచేసిందని పేర్కొన్నారు. అయితే ప్రపంచ గణిత శాస్త్రవేత్తల బృందం దీనిని ధ్రువీకరించాల్సి ఉంది. ఏళ్లుగా రీమన్ హైపోథీసిస్ను పరిష్కరించేందుకు గణిత శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. ప్రధాన సంఖ్యలకు సంబంధించి 1859లో జర్మనీకి చెందిన బెర్న్హార్డ్ రీమన్ దీన్ని ప్రతిపాదించారు. అయితే ఇంతవరకు దీన్ని ఎవరూ నిరూపించలేకపోయారు