తన పెళ్లి సందర్భంగా కావ్య మారన్… సన్ గ్రూప్ ఉద్యోగులకు బంగారం ఉంగరాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. సన్ గ్రూప్ ఉద్యోగులు స్పెషల్ గిఫ్ట్ బాక్సులు అందుకున్న వీడియోలు ట్రెండ్ అవుతున్నాయి. పెళ్లి వేడుకకు సంబంధించిన కార్డుతో పాటు చాక్లెట్స్, గోల్డ్ రింగ్ ఉన్నాయి. తమకు గోల్డ్ కాయిన్స్ ఇస్తారని భావించామని… కానీ గోల్డ్ రింగ్స్ ఇస్తారని ఊహించలేదని ఓ ఉద్యోగి ఆనందం వ్యక్తం చేసిన వీడియో వైరల్ అవుతోంది.