తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఓఎస్డీగా చెప్పుకుంటూ కొలుగూరి రవికిరణ్ అనే వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేశాడు. నకిలీ ఓఎస్డీ ఐడీ కార్డులు, నకిలీ ప్రభుత్వ నియామక ఉత్తర్వులను సృష్టించి నిందితుడు నిరుద్యోగులను, ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులను బురిడీ కొట్టించాడు. టీచర్, మున్సిపల్ అటెండర్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, రికార్డ్ అసిస్టెంట్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50.87 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు.

