మధ్య అమెరికా దేశమైన హోండురాస్‌లో కాల్పుల సంఘటనలు కలకలం సృష్టించాయి. దుండగులు రెండు వేర్వేరు చోట్ల జరిపిన కాల్పుల్లో ఈ ఘటనల్లో 25 మంది మరణించారు. మృతుల్లో 6గురు పోలీసులు ఉన్నారు. గురువారం, దేశ ఉత్తర ప్రాంతంలోని ట్రుజిల్లో మునిసిపాలిటీలో భాగమైన రిగోరెస్‌లోని ఒక మారుమూల తోటలో కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక చర్చి వద్ద గుమిగూడిన కార్మికులపై సాయుధ అనుమానితులు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది.