ఎండల ధాటికి తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి. సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగే అవకాశం ఉందని, గురువారం పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో గరిష్ఠ ఉష్ణోగ్రత 48.1 డిగ్రీలు నమోదైందని, 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు దాటినట్లు తెలిపారు. 20 జిల్లాల పరిధిలోని 200 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయని ఆయన వెల్లడించారు. తెలంగాణలో 45 డిగ్రీలు ఉష్ణోగ్రతలు దాటాయి.. ఖమ్మం జిల్లా ఏడూళ్ల బయ్యారంలో 46.2 డిగ్రీలు, రామగుండంలో 44.6 డిగ్రీలు.