తెలంగాణలోని మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద వరంగల్ రూ.4,674 కోట్లతో వరంగల్ నగరంలో మురుగు నీటి వ్యవస్థ ఆధునీకరణ, రూ.840 కోట్లతో కరీంనగర్ మోడల్ రోడ్లు, ఇతర నిర్మాణాలు, రూ.166 కోట్లతో ఖమ్మం- వరంగల్- కరీంనగర్ కారిడార్ ఏర్పాటు వంటివి ఉన్నాయి. ఈ మూడు ప్రాజెక్టుల విలువ మొత్తం రూ.5681.04 కోట్లు కాగా, కేంద్రం 25 శాతం నిధులు రూ.1420.26 కోట్లను విడుదల చేసింది.