పొట్టి ప్రపంచకప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో వార్తల్లో నిలిచిన కెనడా క్రికెట్‌లో మరో అలజడి మొదలైంది. అప్పుడు సెలెక్టర్లను బెదిరించిన గ్యాంగ్‌స్టర్లు.. ఈసారి ఏకంగా కొత్తగా ఎన్నికైన బోర్డు అధ్యక్షుడి నివాసంపై కాల్పులకు తెగబడ్డారు. ఇటీవలే కెనడా క్రికెట్ చీఫ్‌గా ఎంపికైన అర్విందర్ ఖోసా ఇంటిపై కొందరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్, అవినీతిపై విచారణ జరుగుతున్న ఈ సమయంలో బోర్డు అధ్యక్షుడిని భయపెట్టాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిగినట్టు సమాచారం.