భారతదేశాన్ని కుదిపేసిన 2019 పుల్వామా ఉగ్రదాడిలో 40 మందికి పైగా CRPF జవాన్ల వీరమరణానికి కారణమైన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హంజా బుర్హాన్ అంతమయ్యాడు. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) లోని ముజఫరాబాద్‌లో మే 21న గుర్తుతెలియని దుండగులు జరిపిన కాల్పుల్లో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి కశ్మీర్ లోయలో ఉగ్రవాద నెట్‌వర్క్‌ను నడుపుతూ, ఎంతోమంది యువతను తప్పుదోవ పట్టించిన ఈ కరడుగట్టిన ఉగ్రవాది మరణం..కోలుకోలేని దెబ్బ అని భారత భద్రతాధికారులు భావిస్తున్నారు.