రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ ఈ ఏడాది చివర్లో వివాహం చేసుకోబోతున్నారంటూ కోలీవుడ్ మీడియాలో రకరకాల కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి మధ్య గత కొంతకాలంగా ప్రేమ నడుస్తోందని, వీరు విదేశాల్లో కలిసి తిరిగినట్లు, అక్కడ డిన్నర్ డేట్లలో ఎంజాయ్ చేసినట్లు కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. తాజాగా ఈ పెళ్లి సంబంధం కోసం సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా రంగంలోకి దిగి మాట్లాడారనే ఊహాగానాలు తమిళ మీడియాలో వినిపిస్తున్నాయి.